పుతిన్ ఫ్యామిలీ కోసం లేటెస్ట్ టెక్నాలజీతో బంకర్

పుతిన్ ఫ్యామిలీ కోసం లేటెస్ట్ టెక్నాలజీతో బంకర్

ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధంలో వందల మంది చనిపోయారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుటుంబ సభ్యుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. ఒకవేళ అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్‌ని ఏర్పాటు చేసినట్టు  చెప్పింది. అట్లయ్‌ పర్వత ప్రాంతంలో అత్యాధునిక వసతులతో రూపొందించిన బంకర్‌కు పుతిన్‌ తన కుటుంబ సభ్యుల్ని తరలించారని బ్రిటన్‌ మీడియా తెలిపింది. మరోవైపు, పుతిన్‌ కొంత కాలంగా మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారని ఆ వార్తా సంస్థ ఆరోపించింది. 

ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను మరింత తీవ్ర తరం చేస్తోంది. మొదట ఉక్రెయిన్​ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు చనిపోయినట్లు  ఉక్రెయిన్‌ ప్రకటించింది. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు. గతకొద్ది రోజులుగా ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్​ నగరమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను శాటిలైట్  చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

భారతీయుల కోసం ఉక్రెయిన్ కు 50 విమానాలు