రూ.20 వేల కోట్లు సేకరించనున్న వొడాఫోన్ ఐడియా

రూ.20 వేల కోట్లు సేకరించనున్న వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ :  బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 20 వేల కోట్ల వరకు సేకరించేందుకు వొడాఫోన్ ఐడియా (వీ)  బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది.  క్యాపిటల్‌‌ను సేకరించడంపై షేర్‌‌‌‌హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు  ఎక్స్‌‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌ను (ఈజీఎం) మంగళవారం నిర్వహించింది.  షేర్లను, బాండ్లను అమ్మడం ద్వారా రూ.45 వేల కోట్లను సేకరించాలని వొడాఫోన్ ఐడియా ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా బోర్డు అనుమతి పొందింది. జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌  తమ 5జీ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తుండడంతో పాటు సబ్‌‌స్క్రయిబర్లను పెంచుకుంటున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లను నిలుపుకోవడంలో ఇబ్బంది పడుతోంది. కాగా, ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ ఏడాది జూన్‌‌లోపు రూ.20 వేల కోట్ల వరకు సేకరించేందుకు  ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.