వొడాఫోన్ ఐడియాను రైట్స్ గట్టెక్కిస్తుందా?

వొడాఫోన్ ఐడియాను రైట్స్ గట్టెక్కిస్తుందా?

ముంబై: దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా అప్పుల ఊబినుండి బయటపడడానికి నిధులను సమకూర్ చుకుంటోంది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లు సేకరించేందుకు సిధ్దమవుతోంది. రెండేళ్ల కిందట వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ విలీనం ప్రకటించినప్పడు ఒక షేరు విలువ రూ.130చొప్పున మొత్తం కంపెనీ విలువను రూ.92 వేలకోట్లుగా ప్రమోటర్లు అంచనా వేశారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన రెండు వారాల వ్యవధి గల ఈ ఇష్యూ ద్వారా ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్ల నుండి షేరుకురూ.12.5 చొప్పున నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. చవకైన టారిఫ్ ప్లాన్లతో జియో దెబ్బకొట్టడంతోపాటు గట్టి పోటీ, ఆర్థికంగా క్షీణించడం,విలీనంలో ఆలస్యం వంటివి కంపెనీని విలువను మరింత తగ్గిం చాయి. ప్రస్తుత ఇష్యూ తగ్గింపు ధరకే లభిస్తుందని, దీంతో ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు తక్కువ ధరకే తమ హోల్డింగ్స్‌‌‌‌ను మరింత పెంచుకోవచ్చని కేఆర్ ఛోక్సీ మేనేజింగ్ డైరెక్టర్ దేవెన్ ఛోక్సీ అన్నారు.కానీ ఈ స్టాక్స్ రిటర్న్స్‌ ను మాత్రం త్వరగా ఇవ్వలేవని చెప్పారు. కంపెనీకి మరింత ఎక్కువ కాపిటల్ అవసరమవుతుందని తెలిపారు. రైట్స్ ఇష్యూ కంపెనీకిపెద్దగా ఉపయోగపడదని, వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునేవారికే ఈ ఇష్యూ ఎక్కువగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

అప్పు రూ.లక్ష కోట్లపైనే

వొడాఫోన్ ఐడియా అప్పు సుమారు రూ.లక్షా 23 వేలకోట్లు కాగా, ప్రస్తుత నిధుల సేకరణ ద్వారా కంపెనీకున్న అప్పును కేవలం 20 శాతం మాత్రమే తగ్గించుకునే అవకాశం ఉంది. ఇండస్ టవర్స్‌‌‌‌లో ఉన్న తమవాటాను అమ్మే దిశగా కంపెనీ ఆలోచిస్తోంది. దీనిద్వారా సుమారు రూ.5,500 కోట్లను సమీకరించు-కోవచ్చు. రైట్స్ ఇష్యూ తరువాత కూడా కంపెనీకి పెద్దగా ఉపశమనం ఉండకపోవచ్చని, ఒకవేళ 5జీవేలం ఉంటే కంపెనీకి మరిన్ని ఫండ్స్ అవసరమవుతాయని, ఇది కంపెనీకి మరింత భారమని జాయిన్‌ డ్రీకాపిటల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్ అవినాశ్ గోరక్షకర్తెలిపారు. రానున్న యేడాదిన్నర నుండి రెం డేళ్లకాలంలో ప్రణాళికాబధ్ధమైన పెట్టుబడుల ద్వారావొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు మెరుగుపడే అవకాశాలున్నాయని పలు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఆ తరువాత మరిన్ని ఫండ్స్ అవసరమవుతాయని పేర్కొన్నా యి. రైట్స్ ఇష్యూ ద్వారా మైనారిటీ షేర్‌ ‌‌‌‌‌‌‌హోల్డర్ల వాటా మరింత తగ్గుముఖం పట్టనుంది.గత 9 నెలల్లో వొడాఫోన్ ఐడియా దాదాపు 3.5 కోట్లమంది కస్టమర్లను కోల్పోయింది .

మరమ్మత్తు లు అవసరం

డిసెంబర్‌‌‌‌ 2018తో ముగిసిన 9 నెలల కాలానికికంపెనీ రూ.15,150 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. మరో రెం డేళ్ల వరకు కూడా నష్టాలబాటలోనే పయనిం చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నష్టాలు కంపెనీ నెట్‌‌‌‌వర్త్‌‌‌‌ను మాత్రమే తగ్గించడం కాకుండా కంపెనీని ఆర్థికంగా మరింత కుంగదీస్తాయి. కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి మరమ్మత్తులు అవసరం అని ఐసీఐసీఐ సెక్యూరి టీస్ టెలికమ్ అనలిస్ట్ సంజేష్ జైన్  తెలిపారు. రైట్స్ ఇష్యూతో పాటు ఇండస్ టవర్స్‌‌‌‌లో వాటా అమ్మకం, ఫైబర్ ఆస్తుల అమ్మకంవంటివి నిధుల ఆవశ్యకత తగ్గిం చడానికి కొంత ఉపయోగపడతాయి.