న్యూఢిల్లీ: ఫోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది చివరిలో ఇండియాలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్తామని ప్రకటించింది. గ్లోబల్‌గా ఎలక్ట్రిక్ కార్ల వైపు మారాలని చూస్తున్న ఈ కంపెనీ, ఐడీ.4 మోడల్‌తో ఇండియాలో ఈవీ జర్నీ మొదలు పెడతామని పేర్కొంది. దేశంలో ప్యాసింజర్ కార్ల మార్కెట్ ఏడాదికి 5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
తాము మాత్రం ఏడాదికి 10 నుంచి 15 శాతం వరకు గ్రోత్ నమోదు చేస్తామని పేర్కొంది. ఫోక్స్‌వ్యాగన్ గ్లోబల్‌గా ఐడీ.2 నుంచి ఐడీ. బజ్ వరకు వివిధ ఎలక్ట్రిక్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. కిందటేడాది కంపెనీ ఈవీ సేల్స్ 21 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగి 4 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
