ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా

ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య వంటి రాజకీయనేతలతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఈ నెల 12కి విచారణ వాయిదా వేసింది. ఈ నెల 12 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ ఉంటుందని ACB కోర్టు తెలిపింది.

ఈ కేసులో ఆడియో టేపుల విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఇప్పటికే 960 పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకున్న డబ్బు ఎక్కడిదన్నది ఈ కేసులో కీలక అంశం.