Chiyaan 65: చియాన్‌‌ స్పీడు అదిరింది.. సూపర్ హిట్ ‘పార్కింగ్‌‌’ డైరెక్టర్తో విక్రమ్ మూవీ

Chiyaan 65: చియాన్‌‌ స్పీడు అదిరింది.. సూపర్ హిట్ ‘పార్కింగ్‌‌’ డైరెక్టర్తో విక్రమ్ మూవీ

ఈ ఏడాది ఇప్పటికే ‘వీర ధీర సూరన్’చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విక్రమ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌‌లో పెట్టారు. గత మూడేళ్లుగా ఏడాదికో సినిమా అన్నట్టుగా సెలక్టివ్‌‌గా సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో బిజీ అవుతున్నాడు.

ఇప్పటికే ఇందులో రెండు సినిమాలను అనౌన్స్ చేయగా, తాజాగా మరో చిత్రానికి కమిట్ అయినట్టు సమాచారం. తన 63వ సినిమా మడోన్ శివ దర్శకత్వంలో నటిస్తున్న విక్రమ్.. ఈ ఏడాది ఎండింగ్ వరకు ఇది రిలీజ్‌‌ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 64వ సినిమాను ‘96’ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇంకా సెట్స్‌‌కు వెళ్లని ఈ సినిమాను వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌‌లో రిలీజ్‌‌ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈలోపు మరో చిత్రానికి ఆయన ఓకే చెప్పారు. ‘పార్కింగ్‌‌’సినిమాతో మెప్పించిన రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందట. ఇప్పటికే దర్శకుడు చెప్పిన యూనిక్‌‌ స్టోరీలైన్‌‌ నచ్చడంతో విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓవైపు కొడుకు దృవ్‌‌ కెరీర్‌‌‌‌ను సెట్‌‌ చేసే ప్రయత్నంలో ఉన్న చియాన్‌‌ విక్రమ్.. మరోవైపు వరుస సినిమాలతో కెరీర్‌‌‌‌లో స్పీడు పెంచారు.