
కొమురవెల్లి, వెలుగు: పంజాబ్ లో సిద్దిపేట జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కొమురవెల్లి మండలం ఐనాపూర్ కు చెందిన తోట అనిల్(30) ఆర్మీ జవాన్ గా11 ఏండ్ల నుంచి పంజాబ్ లోని అంబాలలో విధులు నిర్వహిస్తున్నారు.
గత నెల అనిల్ కు ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ పూర్తి చేశాడు. అనంతరం 18 రోజులు సెలవు తీసుకొని సొంతూరుకు వచ్చారు. ఈనెల 7న విధుల్లో చేరారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులకు అనిల్ ఫోన్ చేసి చనిపోతునట్టు చెప్పాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సిద్దిపేట జిల్లా పోలీసు కమిషనర్ అనురాధకు కంప్లయింట్ చేశారు. అనిల్ మిస్సింగ్ పై అంబాల ఆర్మీ ఆఫీసు అధికారులు సమాచారం అందించగా అతని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.