నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్లే: మోడీ

నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్లే: మోడీ

మోడీ జాతీయవాదమే బీజేపీకి ప్రేరణ అని మరోసారి గుర్తుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తనకు ఓటేస్తే దేశానికేసినట్లేనన్నారు. ఫస్ట్​టైమ్ ఓటర్లందరూ పుల్వామా అమరవీరులకు, ఎయిర్ స్ట్రైక్స్ చేసిన వీరజవాన్లకు ఓటేయాలని పిలుపునిచ్చారు. యువతకు సమాజంఎంతో ఇచ్చిందని, బదులుగా వారంతా బీజేపీ గుర్తుపై మీటనొక్కా లని కోరారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే రైతులకు ఇస్తా మన్నట్లే, దేశంలోని చిన్నతరహా వ్యాపారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లాతూర్ (మహారాష్ట్ర), చిత్రదుర్గ(కర్ణాటక),కోయంబత్తూరు(తమిళనాడు) సభల్లో ఆయన మాట్లాడారు. పొరుగునున్న పాకిస్థాన్ , కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షపార్టీలు అన్నీ ఒక్కటేనని, వాళ్లంతా చౌకీదార్ని చూసి వణికిపోతున్నారని విమర్శించారు.

తీపిగుర్తును నాతో పంచుకోండి

‘ఓ కుటుంబంలో కూతురో, కొడుకో తమ తొలిసంపాదనను సొంతానికి వాడుకోరు. తల్లిదండ్రులకుగానీ దేవుడికిగానీ ఇచ్చేస్తా రు. ఇది ఇండియాలో ఆనవాయితీ. ఈ లోక్ సభ ఎన్ని కల్లో తొలిసారి ఓటేయబోతున్న కోట్లాది మంది యువతకు నా సందేశమిదే. మీ తొలి ఓటు పుల్వామా అమరవీరులకు వేయరా? ఎయిర్ స్ట్రైక్స్ చేసిన వీరజవాన్లకు వేయరా?తొలి ఓటు ఓ తీపి జ్ఞా పకం. యువతకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది. మీకు రోగమొస్తే ఎవరో ఒకరుసాయం చేసి ఉండొచ్చు, ఆర్థికంగానూ ఆదుకుని ఉండొచ్చు. పొందిన సాయానికి రుణం తీర్చు కునేటైమొచ్చింది. తొలి ఓటు బీజేపీకే వేయండి. అలా పడే ప్రతి ఓటు నేరుగా నా ఖాతాలో చేరుతుంది. ఏమాత్రం పొరపాటు చేయొద్దు. నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్లే’’అని మోడీ చెప్పారు. అయితే భద్రతా బలగాలపేరు చెప్పుకొని ప్రధాని ఓట్లు అడగడంపై సీపీఎం ఈసీకి ఫిర్యాదు చేసింది.

పాక్ పుట్టిందే కాంగ్రెస్ వల్ల!

ఇప్పటి వరకు దేశంలో జరిగిన మార్పులకు తానే బాధ్యుడి నని చెప్పిన ప్రధాని మోడీ, ఇకముందు కూడాచాలా చేస్తా నన్నారు. పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ టెర్రర్ స్థావరాలపై దాడులు చేస్తే కాంగ్రెస్ , దానిమిత్రపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని,సరిగ్గా శత్రుదేశం డిమాండ్లనే కాంగ్రెస్ తన మేని-ఫెస్టోలో పెట్టిందని మండి పడ్డారు. ఆర్టికల్ 370ని కొనసాగిస్తామని చెప్పడం ద్వారా, కల్లోల ప్రాంతాల్లోసాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేస్తా మనడం ద్వారా దేశాన్ని ముక్కలు చేస్తా మంటోన్న విభజనవాదులను ప్రతిపక్షాలు సమర్థిస్తున్నాయని ఆరోపించారు. ‘‘అసలీ కాంగ్రెస్ కు బుద్ధుంటే , 1947లోపాకిస్థాన్ పుట్టేదే కాదు . ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకోండి , మీలో మానవత్వం లేదు. యువతకుఏం జవాబు చెబుతారు? శరద్ పవార్ లాంటి వాళ్లుకూడా దేశానికి ఇద్దరు రాష్ట్రపతులు, ఇద్దరు ప్రధానులు ఉండాలనడాన్ని సమర్థించడం దారుణం. స్పేస్లో జరిపిన స్ట్రైక్ కి కూడా సాక్ష్యాలు కావాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అడగటం అవివేకం. కేవలం ఓట్లు దండుకోడానికే వీళ్లంతా తప్పుడు హామీలిస్తున్నారు. కాంగ్రెస్ ది డకోస్లా(మోసపూరిత) మేనిఫెస్టో. మే23తో దానికి ఎక్స్ పైరీ డేట్ ముగుస్తుంది. అదే బీజేపీసంకల్ప పత్రం మాత్రం వచ్చే ఐదేండ్ల దాకా నిలుస్తుంది. ఇండియాను కాపాడుకోవాలంటే మళ్లీ చౌకీదారే ప్రధాని కావాలి’’అని మోడీ చెప్పుకొచ్చారు.