వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలి: తెలంగాణ స్పీకర్కు వినతిపత్రం

వికారాబాద్, వెలుగు: వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ వికారాబాద్ జిల్లా జేఏసీ లీడర్లు కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని, ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. 80 రోజులు వీఆర్ఏలు ధర్నా చేయగా, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జీవో నం.81, 85ను విడుదల చేసిందన్నారు.

ఈ జీవో ప్రకారం వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర శాఖలకు బదిలీ చేసిందని, కానీ వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు మాత్రం ఉద్యోగాలు కల్పించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం చేయాలని కోరారు. వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్ ఉన్నారు.