శంషాబాద్లో మోకాళ్లపై వీఆర్ఏల నిరసన

శంషాబాద్లో మోకాళ్లపై వీఆర్ఏల నిరసన

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. శంషాబాద్ మండల వీఆర్ఏల నిరవధిక సమ్మె ఇవాళ్టికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి ప్రభుత్వ భూములన్నీ కబ్జాలకు గురి అవుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల సర్టిఫికెట్ జారీ ఆలస్యమవుతుందని.. ఇంకా ఆఫీసు పనులన్నీ పెండింగ్ లో పడుతున్నాయని వెల్లడించారు. వెంటనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలపెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. పే స్కేల్ జీవోను విడుదల చేయాలని.. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వీఆర్ఏలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా జనరల్ సెక్రటరీ నీరటి నర్సింహ రంగారెడ్డి, జిల్లా కో కన్వీనర్ జానకి రామ్, శంషాబాద్ మండల అధ్యక్షుడు పానుగంటి నర్సింహా, రవి, సలీం, శివ, రాజు, రాజేష్, మల్లేష్ బాబు, కృష్ణ, పాండు, మహేందర్, ఓం ప్రసాద్, కిషోర్, సురేష్, జగన్, హేమలత, సంతోష, మనీలు పాల్గొన్నారు.