పాస్ బుక్ లు ఇవ్వలేదని VRO ను బంధించిన గ్రామస్తులు

పాస్ బుక్ లు ఇవ్వలేదని VRO ను బంధించిన గ్రామస్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేటలో VRO ను బంధించారు గ్రామస్తులు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నాడని ఆగ్రహంతో గ్రామపంచాయితీ కార్యాలయంలో వీఆర్వోను బంధించారు. పాస్ బుక్ లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని మండిపడుతున్నారు రైతులు. విషయం తెలుసుకున్న తహశీల్దార్..  రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో  వీఆర్వోను వదిలిపెట్టారు.