
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కెరీర్‌లో ఇది 15వ చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, అనంతపూర్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. అనంతపూర్‌లోని కియా గ్రౌండ్స్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్, పంచ్ హ్యూమర్‌తో కూడిన సన్నివేశాలను ఈ షెడ్యూల్స్‌లో చిత్రీకరించారు.
వరుణ్ తేజ్, రీతికా నాయక్‌పై పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ షెడ్యూల్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్. అలాగే రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కామెడీ పంచుతాయని చెప్పారు. ఇక తర్వాతి షెడ్యూల్‌ను కొరియాలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు.