సాయి హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: వివి వినాయక్

సాయి హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: వివి వినాయక్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఛత్రపతి’. పెన్ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు. ప్రభాస్‌‌‌‌, రాజమౌళి కాంబినేషన్‌‌‌‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’కి ఇది రీమేక్. ఈ నెల 12న సినిమా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో వివి వినాయక్ మాట్లాడుతూ ‘మంచి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్ కి ముందుగా థ్యాంక్స్. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’ని పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఐకానిక్ సీన్స్ షాట్స్ విషయంలో ఏమీ మార్చలేదు.  ఏదైనా చిన్న మార్పు వున్నా ప్రసాద్ తో మాట్లాడి చేశాం. సాయి చేసిన యాక్షన్ సీన్స్ చూసి ఆశ్చర్యపోయాను. తనని పరిచయం చేసింది నేనేనా అనిపించింది. సాయి సినిమాలన్నీ నార్త్‌‌‌‌లో బాగా ఆడాయి. ఆ నమ్మకంతో పెన్ స్టూడియో గడా ఈ సినిమా చేశారు. హిందీలో సాయి చాలా పెద్ద హీరోగా నిలబడతాడు. బెల్లం కొండ సురేష్ మాకు బ్యాక్ బోన్. ఆయనకి సినిమా అంటే ప్యాషన్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశతో ఉన్నాం’ అన్నారు.

బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ ‘అరవై కోట్లతో పెన్ స్టూడియోస్‌‌‌‌ లాంటి నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేయడం తండ్రిగా నేను ఎంతో గర్వపడే విషయం. నార్త్‌‌‌‌లో చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. మాస్ పల్స్ తెలిసిన వినాయక్ గారు హిందీలో కూడా మా అబ్బాయిని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.