వాళ్లిద్దరినీ టీ20 వరల్డ్ కప్‌‌లో ఆడించాలె

వాళ్లిద్దరినీ టీ20 వరల్డ్ కప్‌‌లో ఆడించాలె

ఇంగ్లండ్‌‌తో టీమిండియా వన్డే సిరీస్‌‌లో రెండో మ్యాచ్‌‌ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే ట్రోఫీ భారత్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో మంచి లైనప్‌‌తో దిగి ఇంగ్లీష్ జట్టును మరోమారు కంగుతినిపించాలని భారత్ భావిస్తోంది. గత మ్యాచ్‌‌లో అవకాశం దక్కని సూర్య కుమార్ యాదవ్ ఇవ్వాళ బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఈ విషయాన్ని పక్కనబెడితే టీ20 సిరీస్‌లో రాణించిన సూర్య కుమార్, ఇషాన్ కిషన్‌‌పై వెటరన్ బ్యాట్స్‌‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌‌లో వీరిద్దరినీ పక్కగా ఆడించాలని సూచించాడు.

‘టీమిండియాలో యువ ప్రతిభావంతులకు కొదవలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా యంగ్‌స్టర్స్ తామేంటో నిరూపించుకుంటున్నారు. ఇది శుభ పరిణామం. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరును మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. టీ20 వరల్డ్‌‌కప్ ఫైనల్ 15లో వాళ్లు ఉండాలె. ఇది కొంచెం కఠినమే కావొచ్చు. కానీ వారి ఆటతీరు చూస్తుంటే ప్రపంచకప్‌‌లో తప్పకుండా ఆడించాలనేలా ఉంది’ అని వీవీఎస్ చెప్పాడు.