
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి నవజ్యోత్ సింగ్ ను యాక్సిడెంట్ చేసి అతని మరణానికి కారణం అయిన గగన్ ప్రీత్ కౌర్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు పొడిగించింది. బుధవారం (సెప్టెంబర్17) ఈ కేసును విచారించిన కోర్టు.. సెప్టెంబర్27 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశించింది. మరోవైపు గగన్‌ప్రీత్ కౌర్ బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు శనివారం వరకు వాయిదా వేసింది.
పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ నివాసితులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ ,అతని భార్య సందీప్ కౌర్ తమ బైక్‌పై వెళుతుండగా ఆదివారం ధౌలా కువాన్‌లో BMW SUV కారు డివైడర్ ను అంచును ఢీకొట్టి బోల్తా పడి వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ నవజ్యోత్ సింగ్ మృతిచెందారు.
సోమవారం మధ్యాహ్నం గగన్‌ప్రీత్‌ను అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఈ కేసుమరోసారి గురువారం విచారణకు రానుంది.