'వ్యవస్థ' వెబ్ సిరీస్ రివ్యూ : ఎమోషన్స్ వర్కౌట్ అవలేదు

'వ్యవస్థ'  వెబ్ సిరీస్ రివ్యూ :  ఎమోషన్స్ వర్కౌట్ అవలేదు

జీ 5 ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన లేటెస్ట్ వెబ్ సిరీస్ వ్యవస్థ. ఆనంద్ రంగా డైరెక్ట్ చేసిన ఈ కోర్ట్ డ్రామా సిరీస్ లో.. హెబ్బా పటేల్ (Hebah Patel), కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెల్సుకుందాం.

కొన్ని కథలు పేపర్ మీద బాగుంటాయి. కానీ.. తెరమీద చూసినపుడు అంతగా ఆసక్తి కలగదు. ఈ "వ్యవస్థ" కూడా అలాంటి కథనే. కథగా చెప్పుకుంటే బానే ఉంది కానీ.. స్క్రీన్ ప్లే మాత్రం ఏమాత్రం ఎంగేజింగ్ గా అనిపించదు. కొన్ని సిరీస్ లలో ఒక్క సీన్ మిస్ అయినా తరువాత ఎం జరుగుతుందో అనేది అర్థంకాదు. కానీ ఈ వ్యవస్థ సిరీస్ లో ఒక్క సీన్ కాదు.. ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ప్రతి ఎపిసోడ్ ఎండింగులో హుక్ పాయింట్, ట్విస్ట్ ఉంటుంది. అవే కాస్త ఇంట్రెస్టింగ్‌ గా అనిపిస్తాయి కోర్టు రూమ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు.. దానికి తగ్గ సీన్స్ కూడా ఉండాలి. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. కానీ ఈ సిరీస్ లో అదే మిస్ అయింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. హెబ్బా పటేల్ తన పాత్ర మేరకు బాగానే చేసింది. కానీ తన క్యారెక్టర్ లో డెప్త్ ఉండదు. సంపత్ రాజ్ (Sampath Raj), కార్తీక్ రత్నం నటన బావుంది.ఇక ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన కామ్నా  జెఠ్మలానీ గౌతమి పాత్రలో చాలా చక్కగా నటించారు. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఇక మొత్తంగా చెప్పాలంటే.. వ్యవస్థ సిరీస్ ఒక రెగ్యూలర్ రొటీన్ కోర్ట్ రూమ్ స్టోరీ. మీకు మరీ అంత టైం ఉంది అంటే ఒక్కసారి ట్రై చెయ్యోచ్చు.