
- తలసేమియా వ్యాధిగ్రస్తుల సేవలో వైశ్య ఫెడరేషన్ ముందంజ
ముషీరాబాద్, వెలుగు: వైశ్య ఫెడరేషన్ ద్వారా ఏడాదిలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు 2306 యూనిట్ల రక్తాన్ని అందించామని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఫెడరేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్ ఆవరణలో రక్తదాన శిబిరం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన విశ్వనాథన్ కార్తికేయను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, చంద్రశేఖర్, నారాయణ, రవికుమార్, ఉప్పల స్వప్న తదితరులు పాల్గొన్నారు.