Rashmika Mandanna : ఫ్యామిలీతో గడిపేందుకు సమయం లేదు .. వీకెండ్ హాలీడే కావాలి!

 Rashmika Mandanna : ఫ్యామిలీతో గడిపేందుకు సమయం లేదు ..  వీకెండ్ హాలీడే కావాలి!

వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారింది పాన్ ఇండియా క్రష్ రష్మిక మందన ( Rashmika Mandanna ) .  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అనే భాషాలకు హద్దులు చెరిపేసి ఆగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.   స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలతో దూసుకుపోతూ, బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకుంటోంది.  తెరపై ఆమె చిరునవ్వులు చిందిస్తూ, ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ పరంగా  విజయ శిఖరాలను అధిరోహిస్తున్నా..  తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్యూలో తన ఆవేదనను  చెప్పుకొచ్చారు..

వరుస సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నా.. కనీసం సెలవులు కూడా దొరకని పరిస్థితి అంటూ రష్మిక తన బాధను పంచుకున్న్నారు.  సినిమా రంగంలో నిరంతరం షూటింగ్‌లు, ప్రమోషన్లు, ప్రయాణాలతో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత బంధాలను, సొంత ఊరిని కూడా కోల్పోవాల్సి వస్తుందన్నారు.  "నా వారాంతపు సెలవు కోసం ఏడుస్తాను" అంటూ ఆమె గుండెలోతుల్లోని బాధను వెళ్లగక్కారు. తనకు 13 ఏళ్ల చిన్న చెల్లి ఉందని, తనకంటే 16 ఏళ్లు చిన్నది కావడంతో ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన చెందారు. "నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఎనిమిదేళ్లుగా ఆమెను నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ విషయంలో చాలా బాధగా ఉందన్నారు.  గత ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లలేదని, కనీసం  స్నేహితులను కూడా కలవలేక పోతున్నానని తన సినీ బిజీ లైఫ్ గురించి పంచుకుంది.

►ALSO READ | Kantara: Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' పోస్టర్ రిలీజ్.. రిషబ్ శెట్టి బర్త్ డే స్పెషల్!

తన సొంత ఊరుకు కూడా వెళ్లేందుకు సమయం దొరకడం లేదు అని రష్మిక పేర్కొన్నారు. గతంలో  కుటుంబ సభ్యులు, స్నేహితులు విహారయాత్రలకు వెళ్తే తనను భాగం చేసుకునే వారు.. కానీ ఇప్పుడు తన అడగడమే మానేశారు.  వృత్తిపరంగా జీవితంలో రాణించాలంటే  వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి..  వ్యక్తిగత జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటే కెరీర్ పరంగా కొన్నింటిని త్యాగం చేయకతప్పదని మా అమ్మ చెప్పేదని రష్మిక గుర్తుచేశారు.  ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఉంది ఈ బ్యూటీ.  ఇటీవల 'ఛావా', ( Chhaava ) ' కుబేర ' ( Kuberaa ) వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో 'థామా' ( Thama ) అనే హారర్ కామెడీతో పాటు 'ది గర్ల్ ఫ్రెండ్' ( The Girlfriend ) లో నటిస్తున్నారు. తాజాగా 'మైసా' ( Myssa ) మూవీలోనూ నటిస్తున్నట్లు ప్రకటించారు.  వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది.