
'కాంతార" ( Kantara ) మూవీ రెండున్నారేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తొలుత ప్రాంతీయ హిట్ చిత్రంగా ప్రారంభమై.. అనతి కాలంలోనే పాన్‌ఇండియా బ్లాక్‌బస్టర్‌గా, సినిమాటిక్ సంచనంలగా అవతరించింది. ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రేమే కాదు.. సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. సినీ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రంతో హోంబళే ఫిలిమ్స్ ఒక అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను అందించింది. కన్నడ నటుడు, దర్శకుడు 'రిషబ్ శెట్టి' ( Rishab Shetty )పుట్టినరోజు సందర్భంగా 'కాంతార చాప్టర్ 1' ( Kantara Chapter 1 ) నుండి అద్భుతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
'కాంతార చాప్టర్ 1' పై పెరుగుతున్న అంచనాలు.
గతంలో వచ్చిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. ఈ ఊహించిన బహుమతి అభిమానుల ఆనందాన్ని పతాక స్థాయికి చేర్చింది. ఇప్పటికే ఈ ప్రీక్వెల్ దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలోనే భారీస్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మందుకురానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కాంతార చాప్టర్ 1' పై సినీ అభిమానుల అంచనాలను మరింత పెంచింది.
ALSO READ : లక్కీ భాస్కర్‌కు సీక్వెల్.. డైరెక్టర్ వెంకీ అట్లూరి క్లారిటీ..
పోస్టర్ వైరల్..
"ఇతిహాసాలు పుట్టిన చోట, అడవి గర్జనలు ప్రతిధ్వనిస్తాయి . 'కాంతారా'తో లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ప్రీక్వెల్ గా ఇది రానుంది. ఈ మూవీ వెనుక ఉన్న వెనుక ఉన్న మార్గదర్శక శక్తి 'రిషబ్ శెట్టి'కి దివ్యమైన ,అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. పురాణానికి నాంది. హృదయాలను కదిలించే కథకు తిరిగి మరోసారి స్వాగతం" అంటూ అధికారిక క్యాప్షన్ పెట్టి హోంబళే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ 'కాంతార చాప్టర్ 1' పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ 'కాంతార చాప్టర్ 1' పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
భారీ యుద్ధ సన్నివేశం హైలైట్ గా నిలవనుందా?
రాబోయే ఈ 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని హోంబళే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ధిమా వ్యక్తం చేసింది. ఇది సినిమాటిక్ స్థాయిని , కథా లోతును రెండింటీని అదిస్తున్నట్లు తెలిపింది. అటు భారతీయ సినిమాలో ఇప్పటివరకు రూపొందించిన అత్యంత క్లిష్టమైన యుద్ధ సన్నివేశాలలో ఒకటి కాంతార చాపర్ట్ 1లో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పట్టణంలో 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ యుద్ద సన్నివేశంలో 500 మందికిపైగా ఫైటర్లు, 3వేల మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సారి " కాంతార: చాప్టర్ 1' భారతీయ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేస్తుందని మూవీ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. మరి కాంతార సృష్టించిన బాక్సాఫీస్ రికార్డులను "కాంతార చాప్టర్ 1" తిరగరాస్తుందేమో చూడాలి మరి.