
మలయాళ నటుడు అయినా వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. గతేడాది ఆయన హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ సెక్టార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ‘‘లక్కీ భాస్కర్’ అనేది ఓ డిఫరెంట్ స్ర్కిప్ట్. దానికోసం చాలా స్టడీ చేశాను. ఆ సినిమా తీసినప్పుడే సీక్వెల్ చేయాలని ఆలోచన వచ్చింది.
ALSO READ : హీరో మహేశ్‌బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు..
రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఆదరణ బట్టి.. దాన్ని డిసైడ్ చేయాలనుకున్నా. అనుకున్నట్టే మంచి విజయాన్ని ఇచ్చి.. సీక్వెల్ చేయాలని అడుగుతున్నారు. తప్పకుండా సీక్వెల్ చేస్తాను. కానీ కొంత టైమ్ తీసుకోవాల్సి ఉంది’ అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అయితే కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా పూర్తవగానే తర్వాత దుల్కర్ సల్మాన్ మూవీనే మొదలుపెట్టేలా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ కూడా ప్రస్తుతం ‘కాంతా’తో పాటు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.