
ఓ గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడంతో గ్రామపెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామంలోకి బయటి వారు రావాలంటే కొన్ని షరతులు విధించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామ స్వాగత తోరణం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘చిరు వ్యాపారులు, యాచకులు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే ఊళ్లోకి రావాలి. మిగతా టైంలో వస్తే రూ.500 ఫైన్’ అని రాశారు. గ్రామంలో చోరీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. - భైంసా, వెలుగు