మైక్రోసాఫ్ట్ తో కలిసి టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్న వాల్‌మార్ట్

మైక్రోసాఫ్ట్ తో కలిసి టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్న వాల్‌మార్ట్

చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల‌ ట్రంప్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ  క్రమంలో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.మరోవైపు అమెరికాలో టిక్‌టాక్‌ను టేకోవ‌ర్ చేసుకునేందుకు ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా ముందుకు వ‌చ్చింది. మైక్రోసాఫ్ట్ తో కలిసి టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాల‌ని వాల్ మార్ట్ చూస్తోంది. 90 రోజుల్లోగా టిక్‌ టాక్ త‌మ దేశంలో ఆప‌రేష‌న్స్ నిలిపివేయాల‌ని ట్రంప్ ఆదేశించారు. టిక్‌ టాక్ కారణంగా త‌మ దేశ ప్ర‌జ‌ల డేటాను చైనా దుర్వినియోగం చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ  క్రమంలో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ మొదట ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. అయితే వీడియో షేరింగ్ యాప్‌ను దక్కించుకునేందుకు ఇప్పుడు వాల్‌మార్ట్ కూడా రంగంలోకి దిగింది. మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి ఆ యాప్‌ను కొంటామ‌ని వాల్‌మార్ట్ చెప్పింది. అమెరికా ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌కు త‌గిన‌ట్లుగా.. టిక్‌టాక్ యూజ‌ర్ల అంచ‌నాల‌కు స‌రిప‌డే విధంగా.. మైక్రోసాఫ్ట్ తో భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్ప‌నున్న‌ట్లు వాల్ మార్ట్ తెలిపింది.