ఫోన్​పేలో వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్ వాటా 85 శాతానికి తగ్గుదల

ఫోన్​పేలో వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్ వాటా 85 శాతానికి తగ్గుదల

న్యూఢిల్లీ: డెకాకార్న్ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ ఫోన్‌‌‌‌‌‌‌‌పేలో వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్ వాటా 89 శాతం నుంచి 85 శాతానికి పడిపోయింది.   ఫోన్​పే తాజా రౌండ్‌‌‌‌‌‌‌‌లో మొత్తం  850 మిలియన్ డాలర్ల ప్రాథమిక మూలధనాన్ని సేకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగిసిన మూడు నెలల్లో ఫోన్​పే కోసం కొత్త రౌండ్లలో వాల్​మార్ట్​  0.5 బిలియన్ డాలర్లను అందజేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు, వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్ గ్రూప్ నుంచి  200 మిలియన్ క్యాపిటల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్యూషన్‌‌‌‌‌‌‌‌తో సహా  750 మిలియన్ డాలర్లను ఫోన్​పే సేకరించింది. జనరల్ అట్లాంటిక్  దాని సహ-పెట్టుబడిదారులు  12 బిలియన్ డాలర్ల ప్రీ-మనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌లో బిలియన్ ఫండింగ్ రౌండ్‌‌‌‌‌‌‌‌లో  550 మిలియన్ డాలర్లను అందించారు.

రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్,  టీవీఎస్​ క్యాపిటల్ ఫండ్‌‌‌‌‌‌‌‌లు ఈ ఫండింగ్ రౌండ్‌‌‌‌‌‌‌‌లో 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. కాగా, యూపీఐ సెగ్మెంట్‌‌లో ఫోన్‌‌పే లీడర్‌‌‌‌గా కొనసాగుతోంది.