Wallmart Layoffs : 2వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వాల్ మార్ట్

Wallmart Layoffs : 2వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వాల్ మార్ట్

అమెరికాలోని అత్యంత పెద్దదైన ఈ కామర్స్ కంపెనీ వాల్ మార్ట్.. ఉద్యోగుల కోతపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అదే గనక నిజమైతే దాదాపు 2వేల ఉద్యోగులు ఇంటి బాట పట్టక తప్పదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆన్ లైన్ అమ్మకాలతో లాభాలను అర్జించిన ఈ కంపెనీ ఇప్పుడు ఆన్ లైన్ షాపర్స్ ను ఇంకా తమవైపు తిప్పుకోవడానికి, అందుకు తగిన కార్యకలాపాలను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించే యత్నం చేస్తోన్నట్టు బ్లూమ్ బెర్గ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలోనే టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో 1,000 మందిని, పెన్సిల్వేనియాలో 600, ఫ్లోరిడాలో 400, న్యూజెర్సీలో దాదాపు 200 మంది గిడ్డంగుల్లో (గోదాముల్లో) పని చేసే ఉద్యోగులను తీసివేయనున్నట్టు అంచనా వేసింది. 

కోతల కారణంగా కొంతమంది వాల్‌మార్ట్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతుండగా.. ఈ సమయంలోనే ఇతర ప్రాంతాలలోనూ విస్తరిస్తూ మరికొందరికి ఎంప్లాయ్ మెంట్ ను అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఆర్డర్‌లను నిర్వహించడానికి స్టోర్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఇటీవలే వాల్ మార్ట్ ప్రతినిధి రాండీ హార్‌గ్రోవ్ స్పష్టం చేశారు. అలా కొంత మంది ఉద్యోగులను వేరే స్టోర్స్ లో సర్దుబాటు చేస్తామని తెలిపారు.