వనపర్తి, వెలుగు: జిల్లాలోని డీ ఫాల్ట్‌గా గుర్తించిన మిల్లుల్లోని వడ్లను సమీప రైస్ మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. సోమవారం మిల్లుల్లో వడ్ల సేకరణ, మిల్లింగ్‌ను పరిశీలించారు. పెద్దమందడి మండలం వీరాయిపల్లిలోని మల్లికార్జున రైస్ మిల్‌ను డీ ఫాల్ట్ గా గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఉన్న వడ్లను సమీప రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు.
చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలని ఆదేశించారు. గణపురం మండలం తిరుమల ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ ఆగ్రో టెక్ మిల్లులకు వడ్ల అన్ లోడింగ్, మిల్లింగ్ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో వడ్ల కొనుగోళ్లు, మిల్లింగ్, రైతులకు చెల్లింపుల విషయంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వెంటనే ట్రక్ షీట్ జనరేట్ చేసి పంపాలని చిట్యాలలోని లక్ష్మీనరసింహ రైస్ మిల్ యాజమాన్యానికి సూచించారు. మిల్లింగ్ ను స్పీడప్ చేయాలని సూచించారు. ఆయన వెంట సివిల్ సప్లై డీఎం జగన్మోహన్, సివిల్ సప్లైఆఫీసర్ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.

