
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ప్రధానిగా చూడాలని ఉందని మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని పోస్టుకు రేసులో దీదీ ముందున్నారని ఆయన చెప్పారు. ‘మా పార్టీ చీఫ్ మమతా బెనర్జీ 2024లో ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు కీలక పాత్ర పోషిస్తాయి. పీఎం పోస్టుకు పోటీ పడుతున్న వారిలో దీదీ అందరికంటే ముందు వరుసలో ఉన్నారనేది ఎవరూ కాదనలేని నిజం’ అని సుప్రియో పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో మార్పుచేర్పుల సమయంలో సుప్రియో మంత్రి పదవి కోల్పోయారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ రెండ్రోజుల కిందటే తృణమూల్‌లో చేరారు.