Good Health : తొందరగా బరువు తగ్గాలా.. ఈ పొరపాట్లు చేయొద్దు

Good Health : తొందరగా బరువు తగ్గాలా.. ఈ పొరపాట్లు చేయొద్దు

తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనతో కొందరు కార్బో హైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మానేస్తారు. హెర్బల్ టీలు తాగుతారు. అయితే, బరువు తగ్గాలంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకోవడంతోపాటు డైట్ విషయంలో డిసిప్లిన్ గా ఉండాలి. ఈజీగా బరువు తగ్గడానికి న్యూట్రిషనిస్ట్ పూజా బంగా చెబుతున్న టిప్స్ కొన్ని.

  • బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా బ్యాలెన్స్డ్ డైట్ తినడం చాలా ముఖ్యం. 
  • కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్ పూర్తిగా తినడం మానేస్తే తొందరగా అలిసిపోతారు తప్ప రిజల్ట్ ఉండదు. 
  • భోజనంలో నలభై శాతం వరకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అన్ని పోషకాలు దొరికే ఫుడ్ ని కొద్ది మొత్తంలో తింటూ, రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదు.
  • ఫ్యాట్ని తగ్గించే ఫుడ్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఏ ఒక్క ఫుడ్ తో బరువు తగ్గడంగానీ, బరువు పెరగడం గానీ జరగదు.
  • పండ్లు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. అలాగని ప్రూట్స్ తోనే బరువు తగ్గాలి అనుకోవడం సాధ్యం కాదు. వీటిలో శరీరానానికి కొంత మొత్తంలోనే 
  • అవసరమైన ప్రొటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి.
  • గంటల కొద్ది కార్డియో వర్కవుట్స్ చేస్తే క్యాలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. 
  • దాంతో, తొందరగా బరువు తగ్గుతాం అనుకుంటారు కొందరు. 
  • కానీ అలా జరగదు. ఎక్కువ సేపు కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల మెటబాలిజం నెమ్మదిగా జరిగే ఛాన్స్ ఉంది. దాంతో అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు.