యుద్ధం.. మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం

యుద్ధం.. మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం

‘యుద్ధం.. మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం. యుద్ధాల వల్ల సామ్రాజ్య  స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువే. సామ్రాజ్యాల్ని నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నోసార్లు మర్చిపోయి ఉండొచ్చు. కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వాళ్లను మాత్రం ఎప్పటికీ మర్చిపోదు’ అంటున్నారు కన్నడ స్టార్ శివరాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న ‘ఘోస్ట్’ చిత్రంలో డైలాగ్ ఇది. ‘బీర్బల్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. 

దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల  కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు.  యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్‌‌‌‌‌‌‌‌తో కట్ చేసిన ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు.. నేను వెళితే రణరంగం మారణ హోమంగా మారుతుంది’ అని శివన్న చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.