మన బడి పనుల్లో నిర్లక్ష్యమా?

మన బడి పనుల్లో నిర్లక్ష్యమా?

మన బడి పనుల్లో నిర్లక్ష్యమా?

ఆఫీసర్లపై కలెక్టర్ ఆగ్రహం

నెక్కొండ, వెలుగు: ‘మన ఊరు–మన బడి’ పనుల్లో నిర్లక్ష్యం పనికి రాదని వరంగల్ కలెక్టర్ గోపి ఆఫీసర్లు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మంగళవారం నెక్కొండ మండలకేంద్రంతో పాటు పనికర ప్రభుత్వ బడులను సందర్శించారు. మన బడి పనులు అడ్డదిడ్డంగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్లాబ్ కు రంధ్రాలు పడడం, ఎలక్ట్రిక్ పనులు నిలిచిపోవడం, డోర్లు పట్టుకుంటేనే ఊడిపోవడం, స్టూడెంట్లు గచ్చుపైనే కూర్చోవడం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. టీచర్లు స్టూడెంట్ల సంఖ్యను పెంచే విధంగా క్షేత్ర స్థా యిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

‘మా భూములు మాకు ఇప్పించండి’

నెక్కొండ పర్యటనకు వచ్చిన కలెక్టర్ కు కొందరు దళితులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. తమ భూమిని వేరేవాళ్లకు పట్టా చేశారని వాపోయారు. నెక్కొండ ఫీల్డ్ ఆఫీసర్ లేబర్ ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వెంటనే అతన్ని తొలగించాలన్నారు. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

పామాయిల్ సాగు పెంచండి..

జనగామ అర్బన్: టార్గెట్ మేరకు పామాయిల్ సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. మంగళవారం ఆయన హర్టికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 6100 ఎకరాలు టార్గెట్ పెట్టుకోగా.. 3400 ఎకరాలకు సంబంధించిన డీడీలు అందాయని తెలిపారు. అర్జీ పెట్టుకున్న వారికి వెంటనే సామగ్రి పంపిణీ చేయాలన్నారు. ప్లాంటేషన్, ఎక్విప్ మెం ట్ ఇన్ స్టాలేషన్ పూర్తి చేయాలన్నారు. జిల్లా పామా యిల్ సాగులో మొదటి స్థానంలో నిలపాలన్నారు.

పనులు నాణ్యతతో చేపట్టాలి..

మహబూబాబాద్: ‘మన ఊరు–మన బడి’ పనుల్లో క్వాలిటీ పాటించాలని కలెక్టర్ శశాంక సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో రివ్యూ చేశారు. జిల్లాలో మొదటి దశలో 316 స్కూల్స్ ఎంపిక చేశామని ఇందుకోసం రూ.70కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటివరకు రూ.45కోట్ల మరమత్తు పనులు సాంక్షన్ చేశామన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లను కోరారు.