
నెక్కొండ, వెలుగు: మండల పరిధిలోని సాయిరెడ్డిపల్లి అంగన్వాడీ టీచర్ సునీత ఎన్ హెచ్టీసెస్ యాప్‌లో స్టూడెంట్స్అటెండెన్స్12 గంటలైనా వేయకపోవడంతో వరంగల్ కలెక్టర్ సత్యశారద షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుధవారం నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి, రెడ్లవాడ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. సాయిరెడ్డిపల్లి అంగన్వాడీ తనిఖీ చేశారు. ప్రైమరీ స్కూల్ శిథిలావస్థకు చేరిన బిల్డింగ్‌ను పరిశీలించారు.
రెడ్లవాడ ప్రైమరీని సందర్శించి, స్టూడెంట్స్‌తో కలిసి భోజనం చేశారు. వారితో పాఠాలు చదివించారు. ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ను సందర్శించి, మెడిసిన్ నిల్వలపై ఆరా తీశారు. వానాకాలం అలర్ట్‌గా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆఫీసర్లు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌వెంట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.