హాస్టల్ వార్డెన్లపై కలెక్టర్ ఆగ్రహం

హాస్టల్ వార్డెన్లపై కలెక్టర్ ఆగ్రహం
  • విధుల్లో లేకపోవడంతో షోకాజ్ నోటీసులు!

వర్ధన్నపేట, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని వరంగల్​కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేటలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలికల హాస్టల్​తో పాటు ఇల్లంద కేజీబీవీని ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

హాస్టళ్లలో వార్డెన్లు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్​ నోటీసులు ఇస్తామన్నారు. ఇల్లంద కేజీబీవీలో విద్యార్థుల ఫిర్యాదుల పెట్టెను చూసి వాటికి సమాధానం చెప్పాలని సిబ్బందిని ప్రశ్నించారు.

 విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతం వర్ధన్నపేట ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు.