వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీకి ఇండియన్ పోలీసు మెడల్

వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీకి ఇండియన్ పోలీసు మెడల్

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్ కు చెందిన అడిషనల్‍ డీసీపీ నల్లమల రవి ఇండియన్‍ పోలీస్‍ మెడల్‍కు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. మహబూబ్‍నగర్‍ జిల్లా ఏనుగొండకు చెందిన రవి 1991లో ఎస్ఐగా పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరారు. 

సీఐగా, డీఎస్పీగా, అడిషనల్‍ డీసీపీగా పదోన్నతులు పొందారు. మావోయిస్ట్  ప్రాబల్యం, సమస్యాత్మక పోలీస్‍ స్టేషన్ల పరిధిలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ఉన్నతాధికారులు ప్రశంసలు, పలు అవార్డులు అందుకున్నారు. ఇండియన్‍ పోలీస్‍ మెడల్‍కు ఎంపికైన రవిని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍, ఆఫీసర్లు అభినందించారు.