అక్రమ దందాలకు చెక్ పెట్టాలి : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

అక్రమ దందాలకు చెక్ పెట్టాలి : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, గుట్కా విక్రయాలు, పేకాట, బెట్టింగులు, రేషన్ బియ్యం తదితర దందాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వరంగల్​ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్ కేఎంసీలో మంగళవారం కమిషనరేట్ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ముందస్తు  ప్రణాళికలతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.