ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • జిల్లా హాస్పిటల్​లో బాధితుడికి పరామర్శ
  • జడ్పీ చైర్మన్​ పాగాల, ఎమ్మెల్యే రాజయ్య

జనగామ,వెలుగు: టీఆర్ఎస్​  కార్యకర్త చాగంటి రాజుపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలను వదిలేది లేదని జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. శుక్రవారం జనగామ జిల్లా జఫర్ గఢ్​ మండలం కూనూరులో  ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ లీడర్ల దాడిలో గాయపడ్డ రాజును జనగామ జిల్లా హాస్పిటల్​లో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూనూర్ లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనతో బీజేపీ వైఖరి మరోసారి బయటపడిందన్నారు.  ప్రజల్లో సానుభూతి పొందడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. ఘటనపై ఎంక్వైరీ చేసి దోషులను వదలమన్నారు. 

  • ప్రజా సంగ్రామ యాత్రకు భారీ స్పందన
  • స్టేషన్​ఘన్​పూర్​ సెగ్మెంట్ లో ముగిసిన సంజయ్​ పాదయాత్ర 

స్టేషన్​ఘన్​పూర్​(జఫర్​గఢ్​), వెలుగు: ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన 3వ విడత ప్రజాసంగ్రామ యాత్ర స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గంలో శుక్రవారం ముగిసింది.  పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెబుతూ పోలీసులు స్టేషన్​ఘన్​పూర్​మండలం పాంనూరు వద్ద మూడు రోజుల కింద(మంగళవారం) బండి సంజయ్​ను పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈక్రమంలో హైకోర్టు అనుమతితో మూడు రోజుల తర్వాత శుక్రవారం యాత్రను పాంనూర్​వద్ద ప్రారంభించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇనుగాల కరుణ బండి సంజయ్​యాత్రను స్వాగతించారు. ఈ సందర్భంగా బండి సంజయ్​మాట్లాడుతూ ప్రజల బాధలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తుండగా ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తూ రాక్షసానందం పొందుతోందని ఫైర్​అయ్యారు. ఉప్పుగల్లు, కూనూరు, గర్మిళ్లపల్లి, నాగపురం గ్రామాలలో ప్రజలను కలిసిన బండి సంజయ్​ అక్కడక్కడ వారితో మాట్లాడారు. స్టేషన్​ఘన్​పూర్​, వర్ధన్నపేట ఏసీపీలు రఘుచందర్, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు మధ్య బండి సంజయ్​ పాదయాత్ర కొనసాగింది. జఫర్​గఢ్​ మండలం ఉప్పుగల్లు, కూనూరు గ్రామాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి, నాగపురం గ్రామాల వరకు సాగింది. బండి సంజయ్​ పాదయాత్రకు గ్రామాల్లో ప్రజలు నీరాజనాలు పలికారు. డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామని యువత తమ సమస్యలను బండి దృష్టికి తీసుకొచ్చారు. డబుల్​బెడ్రూమ్​ ఇండ్లు, నిరుద్యోగ భృతి.. వంటి సమస్యలపై మెమోరాండం సమర్పించారు. 

  • సిరికొండ వర్సెస్​ గండ్ర వర్గీయుల మధ్య రచ్చ 
  • రేగొండ టీఆర్ఎస్​ నేతల బూతు పురాణం  ​ఆడియో వైరల్

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల టీఆర్ఎస్​లీడర్ల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. మండలాధ్యక్షుడు అంకం రాజేందర్, కోటంచ వార్డు సభ్యుడు కోడెపాక మొగిలి మధ్య ఫోన్లో జరిగిన మాటల యుద్ధం శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నా దేవుడు అంటూ మండలాధ్యక్షుడు రాజేందర్..  ఎవరి ఊర్లో వారే రాజకీయం చేసుకోవాలే తప్ప నా ఊర్లో నీ రాజకీయాలు ఏంటంటూ ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం మాటల యుద్ధానికి దారితీసింది. అయితే వీరి తిట్ల లొల్లిలో ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారిపై మండలాధ్యక్షుడు రాజేందర్ నోరు జారడం వివాదాస్పదమైంది. దీంతో సిరికొండ వర్గీయులు తమ నాయకుని పట్ల నోరుజారిన రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నాయకుల తిట్ల దండకం ఆడియో సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఒకే పార్టీలో ఉంటూ అంటీముట్టనట్లుగా ఉంటున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మధ్య ప్రస్తుత గులాబీ నేతల తిట్ల దండకం ఆడియో ఆజ్యం పోసినట్లయింది. 
 

  • భూకబ్జాపై దర్యాప్తు ప్రారంభం
  • రంగంలోకి ఎస్బీ, ఇంటలిజెన్స్​పోలీసులు
  • జేసీబీతో ట్రెంచ్​ పూడ్చివేత 

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​దండుగడ్డ శివారులో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా హాస్పిటల్​కు సంబంధించి రెండు ఎకరాల ఖాళీ ల్యాండ్​ను కొంతమంది కబ్జా చేశారు. దీనిపై ‘నర్సంపేటలో భూకబ్జా’ పేరుతో శుక్రవారం ‘వెలుగు’లో వార్త పబ్లిష్​అయింది. స్పందించిన రెవెన్యూ, హెల్త్​, పోలీసు ఆఫీసర్లు శుక్రవారం స్పాట్​కు చేరుకున్నారు. కబ్జాదారులు కొట్టిన ట్రెంచ్​ను జేసీబీతో పూడ్చారు. అనంతరం హాస్పిటల్​సూపరింటెండెంట్​ డా.గోపాల్​పోలీసుస్టేషన్ లో కంప్లైంట్​ఇచ్చారు. దర్యాప్తు చేస్తున్నామని, కబ్జాకు పాల్పడినవారిపై కేసు నమోదు చేస్తామని సీఐ రమేశ్, ఎస్సై రవీందర్​ స్పష్టం చేశారు. హాస్పిటల్​ల్యాండ్​ కబ్జా వెనుక మాఫియా ఉన్నట్లు అనుమానిస్తూ ఎస్బీ, ఇంటలిజెన్స్​ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దందాలో ఏడెనిమిది మంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. 

ఎంఎస్ఎంఈ  సేవలను వ్యాపారులు ఉపయోగించుకోవాలి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ జిల్లాలోని వ్యాపారుల కోసం యూనియన్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఎస్ఎస్ఐ బ్రాంచ్​ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నట్లు యూబీఐ జనరల్​ మేనేజర్​ సురేశ్​చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్​ పోచమ్మమైదాన్​లో ఎంఎస్ఎంఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మొట్టమొదటి సారిగా ఈ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ ద్వారా వ్యాపారులకు రూ.50లక్షల పైబడిన లోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వ్యాపారులు, సంస్థలు ఈ బ్యాంకు అందించే లోన్లను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ రీజనల్​ఆఫీసర్​ సత్యం, డిప్యూటీ రీజనల్​హెడ్​ వజీర్​ సుల్తాన్​, ఎంఎల్డీ, ఏజీఎం సర్వేశ్​, తేజవత్​ పాల్గొన్నారు. 

ఈటలకు కోదండరాం పరామర్శ

కమలాపూర్, వెలుగు:  హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కుటుంబాన్ని శుక్రవారం పలువురు నేతలు పరామర్శించారు. ఈటల తండ్రి మల్లయ్య ఇటీవల చనిపోయారు. ప్రొఫెసర్​ కోదండరాం, మాజీ మంత్రి కృష్ణయాదవ్​, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్​, శికారి విశ్వనాథ్, నల్లాల ఓదెలు, సింగర్​ వరంగల్​శ్రీను, లీడర్లు రాజయ్య యాదవ్​, తుక్కగూడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు  రచ్చ లక్ష్మణ్, కౌన్సిలర్​ శివ కుమార్​ఈటల రాజేందర్​ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బీజేపీ సభను సక్సెస్​ చేయాలి

తొర్రూరు, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత -ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను సక్సెస్​చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మానుకోట జిల్లా ఇన్​చార్జి కట్టా సుధాకర్ పిలుపునిచ్చారు. తొర్రూర్​లో శుక్రవారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. శనివారం హనుమకొండ ఆర్స్ట్​కాలేజీలో నిర్వహించే సభకు బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు, నియోజకవర్గ ఇన్​చార్జి పెదగాని సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేశ్, మండల నాయకులు పల్లె కుమార్, బొచ్చు సురేశ్, 15వ వార్డు కౌన్సిలర్ శంకర్ పాల్గొన్నారు.  
మరిపెడ, వెలుగు: హనుమకొండ సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ డోర్నకల్ ఇంచార్జ్ లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలోని నిర్వహించిన కార్యకర్తల సన్నాక సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా ఇన్​చార్జి సుధాకర్ రెడ్డి, గోపికృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

అప్పులు చేసైనా పెన్షన్లు ఇస్తాం.. 
దైవసాక్షిగా చెపుతున్నా  బతుకమ్మలను  అవమానించలేదు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూరు, వెలుగు: ‘దైవ సాక్షిగా చెపుతున్నా.. బతుకమ్మలను నా కారు తొక్కలేదు’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరులో కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ గతేడాది బతుకమ్మ సమయంలో ఆత్మకూరులో గత బతుకమ్మ పండుగ సమయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తూ కావాలనే నాపై బతుకమ్మలను అవమానించినట్లు అసత్య ప్రచారం చేశారన్నారు. నా కారు బతుకమ్మలను తొక్కినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. అప్పులు చేసైనా పెన్షన్లు అందిస్తామన్నారు. అనంతరం మండల కేంద్రంలో 260 మందికి కొత్తగా మంజూరైన పెన్షన్ కార్డులను అందచేశారు. సర్పంచ్ స్వాతి, ఎంపీపీ సుమలత, జడ్పీటీసీ రాధిక,  పాల్గొన్నారు.

సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలు

ధర్మసాగర్, స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: సీఎం  కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. శుక్రవారం ధర్మసాగర్ మండలంలోని 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కొత్తగా మంజూరైన పెన్షన్​కార్డులను 6852 మందికి పంపిణీ చేశారు. స్టేషన్​ఘన్​పూర్​ మండలం ఇప్పగూడెం గ్రామంలో మండలంలోని 18 గ్రామాలకు మంజూరైన పెన్షన్ల కార్డులను పంపిణీ చేశారు. డీఆర్డీవో రాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ వెంకన్న, ఆర్డీవో కృష్ణవేణి, జడ్పీ స్టాండింగ్​ కమిటీ ఛైర్మన్​ మారపాక రవి పాల్గొన్నారు.

జీపీ నిధుల అవినీతిపై ప్రశ్నిస్తే దాడి..!

మరిపెడ, వెలుగు: పంచాయతీ నిధులలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే అధికార పార్టీ సర్పంచ్ వర్గీయులు భౌతిక దాడికి పాల్పడినట్లు మరిపెడ మండలం సొసైటీ వైస్​ప్రెసిడెంట్​గండి మహేశ్​తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మూడున్నరేండ్లుగా ఎల్లంపేట గ్రామంలో అభివృద్ధి పేరిట ఖర్చుపెట్టిన రూ.50 లక్షల్లో అవినీతి జరిగిందని, సహ చట్టం ద్వారా ఆధారాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై గ్రామంలో కొద్దిరోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి వివరాలు బయటపెట్టామన్నారు. శుక్రవారం ఎల్లంపేటలో మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా సర్పంచ్ వర్గీయులు,అధికార పార్టీ కార్యకర్తలు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి విషయమై  కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్​డిమాండ్ చేశారు.

ఘనంగా మదర్​థెరిస్సా జయంతి

వరంగల్​ సిటీ, వెలుగు: ఎంతో మంది కుష్ఠు రోగులను చేరదీసి, అనాథలకు అమ్మగా మారిన మదర్​ థెరిస్సా 112వ జయంతి వేడుకలను శుక్రవారం వరంగల్​పోచమ్మమైదాన్ కెమిస్ర్టీ భవన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ(ఎస్​ఎస్​బీఎం) సంస్థ ఘనంగా నిర్వహించారు. చీఫ్​గెస్ట్​లుగా ఎమ్మెల్యే టి.రాజయ్య, కాంగ్రెస్​పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్​ హాజరయ్యారు. కార్యక్రమంలో కొంగర అనీల్​, ఇమాన్యూయేల్, ఉదయ్​, తిమోతి, రహిమున్సిసా స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంరక్షణ సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని మదర్​ థెరిస్సా అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్​ రాజు, గంధం అరుణ్​ జేమ్స్​, సురేందర్​, విల్సన్​, లాజర్​, సాల్మన్​, నెల్సన్​, అనీల్​, లేవి పాల్గొన్నారు. 

వైఎంసీఏ ఆధ్వర్యంలో...  

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  మహబూబాబాద్​ పట్టణంలో వైఎంసీఏ ఆధ్వర్యంలో మదర్​థెరిస్సా జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మదర్​థెరిస్సా విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎంసీఏ కార్యదర్శి సుధాకర్​, మున్సిపల్​ చైర్మన్​ డా.రామ్మోహన్​రెడ్డి, వైస్​ చైర్మన్​ ఫరీద్​, వైఎంసీఏ గౌరవ అధ్యక్షులు అవింగ్​ నాటర్​ పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి 

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి  కార్మికుడు కోలేపాక సురేందర్(24) చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. భూపాలపల్లి సుభాష్ కాలనీకి చెందిన సురేందర్ కేటీకే 1వ గనిలో జనరల్ మజ్దుర్ గా పనిచేస్తున్నాడు. సొంత కారులో భూపాలపల్లి నుంచి పరకాలకు వస్తుండగా.. పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సురేందర్ ను స్థానికులు  108లో పరకాల ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. ట్రీట్​మెంట్​తీసుకుంటూ చనిపోయాడు. సురేం దర్​కు కొద్దిరోజుల కిందనే పెండ్లి కాగా.. ప్రస్తుతం అతని భార్య ప్రెగ్నెంట్. దీంతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

లెక్చరర్​ పోస్టులు భర్తీ చేయాలి

ములుగు, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్​ పోస్టులను భర్తీచేయడంతోపాటు 1654 గెస్ట్​ లెక్చరర్​ పోస్టులను రెన్యువల్​ చేయాలని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం ములుగులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్​​ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవంత్​యాదవ్, ఎన్ఎస్​యూఐ  జిల్లా అధ్యక్షుడు కోటి, మండల అధ్యక్షుడు నాగ రాజు, అధికార ప్రతినిధి వంశీకృష్ణ, ఎస్టీ సెల్​ మండల అధ్యక్షుడు దేవ్​సింగ్​ పాల్గొన్నారు. 

గ‌‌‌‌‌‌‌‌ణేశ్​ ఉత్సవాల‌‌‌‌‌‌‌‌ను శాంతియుతంగా జ‌‌‌‌‌‌‌‌రుపుకోవాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

మహబూబాబాద్, వెలుగు: వినాయ‌‌‌‌‌‌‌‌క చ‌‌‌‌‌‌‌‌వితి, నిమ‌‌‌‌‌‌‌‌జ్జన ఉత్సవాల‌‌‌‌‌‌‌‌ను శాంతియుతంగా జ‌‌‌‌‌‌‌‌రుపుకోవాల‌‌‌‌‌‌‌‌ని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.   మహబూబాబాద్ ప‌‌‌‌‌‌‌‌ట్టణంలో  డీఎస్పీలు సదయ్య, రఘు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం పీస్​ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వినాయ‌‌‌‌‌‌‌‌క ఉత్సవాల‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు ఆంక్షల‌‌‌‌‌‌‌‌ మేర‌‌‌‌‌‌‌‌కు మండ‌‌‌‌‌‌‌‌పాల వ‌‌‌‌‌‌‌‌ద్ద రాత్రిపూట మైకులు పెట్టవద్దన్నారు. పుకార్లను న‌‌‌‌‌‌‌‌మ్మరాద‌‌‌‌‌‌‌‌ని పేర్కొన్నారు. మండ‌‌‌‌‌‌‌‌పాల వ‌‌‌‌‌‌‌‌ద్ద ఎలాంటి అవాంచ‌‌‌‌‌‌‌‌నీయ సంఘ‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు జ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌కుండా నిర్వాహ‌‌‌‌‌‌‌‌కులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.