
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వారం రోజులు మూతపడనుంది. ఈ నెల 29న సద్దుల బతుకమ్మ, 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహర్నవమి, 2న గాంధీ జయంతి, 3న విజయదశమి సందర్భంగా సెలవులు ప్రకటించగా... 4, 5న శని, ఆదివారం వారాంతపు సెలవులు రానున్నాయి. దీంతో మార్కెట్ మూసి ఉంటుందని, రైతులెవరూ పంట ఉత్పత్తులను తీసుకురావద్దని మార్కెట్ సెక్రటరీ గుగులోత్ రెడ్డి పేర్కొన్నారు.