కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు 70 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఆదివారం సిటీలోని పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 29న వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
