గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ట్రై సిటీలో వాహనాల పార్కింగ్ కష్టాలకు త్వరలో చెక్ పెట్టేందుకు సీపీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ట్రై సిటీ పరిధిలోని ప్రధాన రోడ్డు మార్గాల్లో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హనుమకొండలోని అశోక జంక్షన్, చౌరస్తా, ఏనుగుల గడ్డ, వరంగల్లోని పోచమ్మమైదాన్, హెడ్ పోస్టు ఆఫీస్, ప్రాంతాలను సందర్శించామని పార్కింగ్ కు అవసరమైన స్థల విస్తీర్ణం, సాధ్యాసాధ్యాల పై చర్చించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ట్రాఫిక్ అడిషినల్ డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్ కమిషనరేట్పరిధిలోని ముగ్గురు ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మీల్స్ కాలనీకి కె. కుమార్ స్వామి, టాస్క్ఫోర్స్కు బండారి రాజు, సీసీఎస్కు హరి కృష్ణను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
