
తెలంగాణలో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి యూఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘వార్నర్ బ్రోస్. డిస్కవరీ’ ముందుకొచ్చింది. న్యూయార్క్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ఈ అంశంపై కంపెనీ ప్రతినిధులతో ఒప్పుందం కుదుర్చుకున్నారు.
ఈ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా సుమారు 1,200 మందికి ఉద్యోగాలొస్తాయని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. హెచ్‌బీఓ, సీఎన్‌ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, కార్టూన్ నెట్‌వర్క్, సినీమ్యాక్స్, హెచ్‌జీటీవీ, క్వస్ట్ వంటి ఛానెల్స్‌ను ‘వార్నర్ బ్రోస్. డిస్కవరీ’ ఆపరేట్ చేస్తోంది.