వార్నర్ వండర్ ఫుల్ లీడర్

వార్నర్ వండర్ ఫుల్ లీడర్

హైదరాబాద్:  ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వండర్‌ ఫుల్‌ లీడర్‌ అని..అతని పునరాగమనం తమ జట్టు కెంతో అడ్వాంటేజ్‌ అని సన్‌ రైజర్స్‌  హైదరాబాద్ మెంటర్ వీవీస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంతగడ్డ హైదరాబాద్‌లో సన్‌ రైజర్స్‌ ప్రాక్టీస్‌ ముమ్మరంగా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆటగాళ్లతో బిజీగా గడిపిన లక్ష్మణ్‌ ..మీడియాతో మాట్లాడుతూ వార్నర్‌ తిరిగి జట్టు లోచేరనుండడంపై ఆసీస్‌ టీమ్‌ చూపించిన ప్రేమ కృత్తిమమైనది కాదని, జట్టు విజయంలో అతనిపాత్రను గుర్తించి వార్నర్‌ను గౌరవిస్తున్నారని పేర్కొన్నాడు. అతను వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లాస్‌ బ్యాట్స్‌ మన్‌ అని కితాబిచ్చాడు. డేవిడ్‌ అద్భుతమైన ఆటగాడని, అలాగే గొప్ప నాయకుడని ప్రశంసించా డు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వార్నర్‌ ఉంటే అదో ప్లస్‌పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని పేర్కొన్నాడు. యువత అతని నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు సీజన్‌లో సన్‌ రైజర్స్‌ గురిం చి మాట్లాడుతూ.. తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ లో చాలా కాంబి నేషన్లకు చాన్స్‌ ఉందని, పరిస్థితులకు తగినట్లుగా జట్టును మార్చుకునే అవకాశముందని తెలిపాడు. అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు ఉండడం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించనుందని, టీమ్‌లో ఫ్లెక్సి బిలిటి బాగా పెరింగిదని వ్యా ఖ్యానించాడు. ఈ సీజన్‌ ను తాము చాలా సానుకూల దృక్పథంతో చూస్తున్నామని, జట్టుగా తాము స్థిరమైన ప్రదర్శననిచ్చామని గుర్తుచేశాడు. గతంలో ఒకసారి చాంపియన్‌ గా అవతరించడంతో పాటు గతేడాది రన్నరప్‌ గా నిలిచామని తెలిపాడు. కేవలం ఒక్క సీజన్‌ లో మాత్రమే ప్లేఆఫ్స్‌ కు అర్హత సాధించలేదని పేర్కొన్నాడు.టోర్నీని చక్కగా ఆరంభించాలి. ఈ సీజన్‌లో ఆరంభంలోనే చక్కని విజయాలు సాధించాల్సి న అవసరముందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ప్రారంభ దశలోనే జట్టు లయ అందుకుంటే చివరిదశల్లో చాలా ఉపకరించగలదని తెలిపాడు. మరోవైపు ఢిల్లీ క్యా పిటల్స్‌కు కీలక ఆటగాడు శిఖర్‌ ధవన్‌ తరలిపోవడం దురదృష్టకరమని వ్యా ఖ్యానించాడు. అయినప్పటికీ సన్‌ రైజర్స్‌ బ్యాటిం గ్‌ చాలా లోతైనదని, జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడే ప్లేయర్లకు కొదువలేదని తెలిపాడు. మిడిలార్డర్‌ బెంగ లేదు ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీటోర్నీలో మనీశ్ పాండే, వృద్ధి మాన్‌ సాహాలు సత్తాచాటడంతో సన్‌ రైజర్స్‌ మిడిలార్డర్‌ బెంగ తీరినట్లేనని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. దీపక్‌ హూడా, యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పఠాన్‌ లాంటి ఫినిషర్లతో పాటు మహ్మద్‌ నబీ, షకీబల్‌ హసన్‌ లాంటి ఓవర్‌ సీస్‌ ప్లేయర్లతో జట్టు పటిష్ఠంగా ఉందని తెలిపాడు. జట్టుసమతూకం విషయంలో ఐపీఎల్‌ లోనే సన్‌ రైజర్స్‌ ఉత్తమమైనదని వ్యా ఖ్యానించాడు.మెంటార్‌ గావ్యవహరించడం అద్భుతమైన అనుభవమన్నారు. ప్లేయర్‌ నుంచి మెంటార్‌ పాత్రలోకి ప్రవేశం చాలా స్మూత్‌ గా జరిగిందని చెప్పుకొచ్చాడు.