ODI World Cup 2023: పిచ్చి మాటలు మాట్లాడటం.. అందరిలో పరువు తీయటం: హసన్ రాజాపై అక్రమ్ సీరియస్

ODI World Cup 2023: పిచ్చి మాటలు మాట్లాడటం.. అందరిలో పరువు తీయటం: హసన్ రాజాపై అక్రమ్ సీరియస్

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు వేరే బంతితో బౌలింగ్ చేశారని పాక్ మాజీ ఆటగాడు హసన్‌ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ఐసీసీ, బీసీసీఐ కుమ్మక్కై భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నాయంటూ పిచ్చి వాగుడు వాగాడు. అందువల్లే భారత పేసర్లు ఇతర జట్ల బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్‌ను, స్వింగ్‌ను రాబట్టగలుగుతున్నారంటూ తన నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. అంతేకాదు, ఈ విషయంపై దర్యాప్తు జరపాలని కోరాడు. భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఓ పాక్‌ టీవీ ఛానల్‌లో హసన్ రజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఈ విషయంపై పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ స్పందించాడు. హసన్ రజా వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ అతడికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేసాడు.  హసన్ అర్ధం లేకుండా మాట్లాడాడని.. అతని వ్యాఖ్యలు వింటే నవ్వొచ్చిందని తెలిపాడు. అక్రమ్ మాట్లాడుతూ " హసన్ రజా చేసిన వ్యాఖ్యలను విన్నాను. అతని మాటలను నేను ఏకీభవించను. హసన్ తన పరువు తాను తీసుకొని పాక్ పరువుని కూడా మంట గలుపుతున్నాడు. గ్రౌండ్ లో అంపైర్స్, రిఫరీస్, ఇంత టెక్నాలజీ ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది. భారత బౌలర్లు ప్రపంచంలోనే బెస్ట్.  అందుకే అంత బాగా బౌలింగ్ చేశారు". అని అక్రమ్ ఈ మాజీ క్రికెటర్ పై సీరియస్ అయ్యాడు. 

ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు 55 పరుగులకే ఆలౌటయ్యారు. పేసర్లు షమీ, సిరాజ్, బుమ్రా విజ్రంభించడంతో టీమిండియా ఏకంగా 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. షమీ 5 వికెట్లు తీసుకోగా, సిరాజ్ కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా, జడేజాలకు చెరో వికెట్ లభించింది. ఇక ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో కూడా శ్రీలంకను టీమిండియా 50 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.