రోబోలు ఫైటింగ్ చేయడం.. తుపాకులతో ఫైరింగ్ చేయడం చూసుంటారు. కానీ ఇప్పుడు రోబోలతో మరో ప్రయోగం చేశారు బోస్టన్ డైనమిక్స్ కు చెందిన శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. నాలుగు రోబోలు పాటకు తగినట్టు స్టెప్పులేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న వీడియో ఓకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డూ యూ లవ్ మీ అనే సాంగ్ కు మొత్తం రోబోలు డ్యాన్స్ చేశాయి. మనుషుల మాదిరిగా స్టెప్పులు అందరినీ అలరిస్తున్నాయి. దాదాపు 3 నిముషాలున్న రోబో డ్యాన్స్ వీడియోను బుధవారం ఉదయం నాటికి 24 గంటలలోపు 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
This is not CGI https://t.co/VOivE97vPR
— Elon Musk (@elonmusk) December 29, 2020
