
కన్నతండ్రి వర్సెస్..కన్నకొడుకు..ఇద్దరు బీభత్సంగా తన్నుకున్నారు.మామూలుగా కాదు..గొర్రెపొటేళ్లు కొట్టుకున్నట్లు..వెనక్కి వెళ్లి ముందుగా స్పీడ్ వచ్చి.. కార్లతో ఢీకొట్టుకుంటూ.. వాళ్లు ఢీకొట్టడమే కాదు.. తోటి వాహనాదారులను ఢీకొట్టి ప్రాణాల మీదగా తెచ్చారు..ముంబైలో కార్లతో ఢీకొట్టుకుంటూ నడిరోడ్డపై గొడవపడ్డారు తండ్రీకొడుకులు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలోని అంబర్‌నాథ్‌లో టాటా సఫారీ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్‌ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ఆగంతకుడు చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"In Ambernath, fortuner vs safari
— rora chats~ (@rora_chats) August 21, 2024
pic.twitter.com/GK6l12oJlX
మంగళవారం ఆగస్టు20,2024 సాయంత్రం కళ్యాణ్-బద్లాపూర్ రహదారిపై ఫార్చూనర్ కారులో ముంబై నివాసి , సఫారీ నడుపుతున్న అతని కొడుకు మధ్య విభేదాలు రోడ్డుపై చిందులు తొక్కాయి. గొడవ తర్వాత కొడుకు తన తండ్రి కారును ఢీకొట్టాడు.
బ్లాక్ సఫారీలో ప్రయాణిస్తున్న మాజీ డిఫెన్స్ అధికారి బిందేశ్వర్ శర్మనుఫార్చూనర్ కారులో అతని కొడుకు సతీష్ శర్మ వెనుక నుండి ఢీకొట్టాడు. ఆ తర్వాత వేగంగా ముందుకు దూసుకువెళ్లి తిరిగి యూటర్న్ తీసుకొని మరోసారి ఎదురెదురుగా ఢీకొట్టడంతో అతని తండ్రి ఎస్‌యూవీ రివర్స్‌లో 10 అడుగుల మేర స్కిడ్ అయి ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది.
ఇంకేముంది ఇద్దరి పంచాయతీ పోలీసులకు చేరింది.. నడిరోడ్డుపై కొట్లాట ఏందీ .. అదీ కార్లతోఢీకొట్టుకోవడం ఏంటని .. తండ్రీకొడుకులిద్దరిని గట్టిగానే మందలించారట పోలీసులు.