
క్రికెట్‌లో ఎన్నో క్యాచ్‌లు చూసుంటాం. కొందరు క్రికెటర్లు తమ అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంటారు. ఇలాంటి క్యాచులను క్రికెటర్లు పట్టడం కామన్ కానీ ఫుట్‌బాల్ ప్లేయర్లు పట్టడం విశేషంగా చెప్పొచ్చు. ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇంగ్లండ్‌లోని టాటెన్‌హామ్ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్లు రీసెంట్‌గా క్రికెట్ ఆడారు. వార్మప్‌లో భాగంగా ఇండోర్ కాంప్లెక్స్‌లో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఓ బ్యాట్స్‌మన్ మిడాన్ దిశగా బంతిని కొట్టాడు. తక్కువ ఎత్తులో దూసుకెళ్లిన బాల్‌ను అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డెలీ అలీ అనే ప్లేయర్ దాన్ని కాలితో ఆపే ప్రయత్నం చేశాడు. బాల్ అతడి కాలికి తగిలిన వెంటనే పైకి లేవడంతో డెలీ క్యాచ్ పట్టాడు. ఫుట్‌బాల్‌ను కాలితో ఆపి పైకి లేపే విధంగా క్రికెట్ బాల్‌నూ ఆపి క్యాచ్ పట్టుకున్న తీరు అందర్నీ అలరిస్తోంది. అది కూడా వేగంగా వెళ్తున్న బంతిని అలా పట్టుకున్న తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
?⚽️? pic.twitter.com/Ngy3LXQLak
— Dele (@dele_official) November 23, 2020