పూణెలో మంచినీటి సంక్షోభం.. తాగటానికి జనం విలవిల

పూణెలో మంచినీటి సంక్షోభం.. తాగటానికి జనం విలవిల

దేశ వ్యాప్తంగా మెట్రో పాలిటెన్ నగరాలకు నీటి సంక్షోభం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో తాగడానికి నీళ్లు సరిపోక జనం బిక్కబిక్కుమంటున్నారు. నిన్న బెంగుళూరు, నేడు పూణే  నీటి కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి.  భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి సంక్షోభం భారీగా పెరిగింది. నీటి సంరక్షణ కోసం పిలుపులు వంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, వేసవి ప్రారంభంతో నివాసితులు తమ రోజువారీ నీటి అవసరాలను తీర్చడానికి కష్టపడుతున్నారు.  

 అంబేగావ్ బుద్రుక్‌లోని సిన్హ్‌గడ్ కాలేజ్ పరిసార్ సజగ్ నాగ్రిక్ మంచ్ కృతి సమితి వైస్ ప్రెసిడెంట్ నిర్మలా థోర్మోట్ మాట్లాడుతూ తమ సొసైటీకి చెందిన నాలుగు బోర్‌వెల్‌లు, గతంలో ప్రతిరోజూ దాదాపు రెండు ట్యాంకర్లను నింపేవని, ఇప్పుడు కేవలం ఒకటి నింపలేకపోతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని నీటి ట్యాంకర్ నిర్వాహకులు కూడా బోర్‌వెల్‌ల నుండి తగినంత నీటి సరఫరాను పొందడంలో విఫలం అవుతున్నారని చెప్పారు.  

నీటి సరఫరాను అందించే నాలుగు డ్యామ్‌లు ప్రస్తుతం వాటి నిల్వ సామర్థ్యంలో 45.90 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి, ఇది 13.38 TMCకి సమానమి గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందన్నారు.  జిల్లా గార్డియన్ మంత్రి అజిత్ పవార్ పూణే నగరానికి నీటి కోతలను అమలు చేయవద్దని కోరారు. నీటి సరఫరా ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.