పాతబస్తీలో  పలు ప్రాంతాలు జలమయం

పాతబస్తీలో  పలు ప్రాంతాలు జలమయం

నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ ఆగమైంది. ఉదయం 7గంటల నుంచి రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. చార్మినార్, యాకత్ పురా, తలాబ్ కట్ట, మక్కా కాలనీ, తాడ్ బన్, ఛత్రినాక, ఉప్పుగూడ, బాబా నగర్, చంద్రాయణ గుట్ట తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోని వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. పలుచోట్ల చెట్లు, ఫ్లెక్సీలు కూలి రోడ్లపై పడ్డాయి. వర్షం కారణంగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరద నీటి ప్రవాహం తగ్గినప్పటికీ ప్రధాన రహదారుల్లో బురద పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 

మరిన్ని వార్తల కోసం..

యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో బయటపడ్డ నాణ్యతాలోపం

హైదరాబాద్లో గాలివాన బీభత్సం