వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తులు ..స్వీకరించనున్న హైదరాబాద్ కలెక్టర్

 వాట్సాప్ లో  ప్రజావాణి దరఖాస్తులు  ..స్వీకరించనున్న హైదరాబాద్ కలెక్టర్
  • సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు,  ఉద్యోగులకు ఉపయోగకరం  
  • 74166 87878 నంబర్​ కేటాయింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇప్పటివరకు హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అంతా నేరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే,  సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ప్రజావాణికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులైతే ప్రజావాణికి రాలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ హరిచందన వాట్సాప్ ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని ప్రకటించారు. 

దీనికోసం ప్రత్యేకంగా 7416687878 నంబర్​కేటాయించారు. ఈ వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే వాటిని సిబ్బంది డౌన్​లోడ్​చేసుకుంటారని, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోర్టల్ లో నమోదు చేసి ఫిర్యాదు దారుడికి ఐడీ నెంబర్ కేటాయిస్తారన్నారు. అలాగే, వారంలోపు ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాల సమాచారాన్ని కూడా వాట్సాప్ ద్వారా తెలియజేస్తారన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లదే కీలకపాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేరుగా వచ్చే ఫిర్యాదులతో పాటు వాట్సాప్ ఫిర్యాదులకు కూడా ఒకే రకమైనా ప్రాధానత్య ఉంటుందన్నారు.