
ఎప్పుడూ డ్యూటీలో బిజీగా ఉండే వయనాడ్ జిల్లా కలెక్టర్ గీత.. కథాకళి డ్యాన్స్ తో అదరగొట్టారు. శనివారం రాత్రి జిల్లాలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో కథాకళి నాట్యంలో అరంగేట్రం చేశారు. తాను చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు స్టేజీల మీద డ్యాన్స్ చేసినప్పటికీ.. కథాకళి ప్రదర్శన ఇవ్వాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని చెప్తున్నారు కలెక్టర్ గీత. ‘కొచ్చుకొచ్చు సంతోషాంగల్’ అనే తమిళ సినిమాలోని భక్తి పాటకు ఆమె డ్యాన్స్ చేసిన వీడియో అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు, షెల్టర్ హోంలోని ఖైదీల పెండ్లి వేడుకలోనూ డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. నిరుడు సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్గా గీత బాధ్యతలు తీసుకున్నారు. - వయనాడ్ జిల్లా, కేరళ