
వాషింగ్టన్ డీసీ: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకులు ప్రధాని మోడీ కోరిన వెంటనే పంపామని బైడెన్ తెలిపారు. ‘భారత్‌తోపాటు బ్రెజిల్‌కు మేం ఇతోధిక సాయం చేస్తున్నాం. ప్రధాని మోడీతో పలు విషయాల గురించి మేం మాట్లాడాం. వ్యాక్సిన్ ప్రొడక్షన్‌కు ముడిసరుకులు కావాలని మోడీ కోరారు. దీంతో వెంటనే మేం వాటిని ఇండియాకు పంపాం. దీంతోపాటు మెడికల్ ఆక్సిజన్‌ను కూడా పంపుతున్నాం. భారత్ కోసం మేం చాలా చేస్తున్నాం’ అని బైడెన్ చెప్పారు. కాగా, వ్యాక్సిన్ ప్రొడక్షన్ కోసం అవసరమైన ముడిసరుకులు, లిక్విడ్ ఆక్సిజన్‌తో కూడిన యూఎస్ ఫ్లయిట్‌లు ఢిల్లీకి చేరుకున్నాయని తెలిసింది.