మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం :ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం :ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. బుధవారం లోక్ సభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకమని చెప్పారు. దీనికి కారణం ఓబీసీ, ముస్లిం మహిళల గురించి ఈ బిల్లులో ప్రస్తావన లేదని చెప్పారు. అగ్రవర్ణాల మహిళలను మాత్రమే మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందని విమర్శించారు. 

ముస్లిం మహిళల జనాభా 7 శాతం ఉందని లోక్ సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 0.7 శాతం మాత్రమే ఉందదన్నారు ఒవైసీ. ముస్లిం మహిళలు చదువులో కూడా వెనకబడి ఉన్నారని.. వారికి రిజర్వేషన్ సద్వినియోగం కావాలని కోరారు  ఒవైసీ.