
దసరా పండుగ సందర్భంగా చెన్నూరు నియోజవర్గాన్ని సందర్శించారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గురువారం (అక్టోబర్ 02) క్యాంపు కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
చెన్నూర్ నియోజకవర్గంలోనీ చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.